
నెట్ ఫ్లిక్స్, సౌందర్య కాంబోలో లవ్
తమిళసినిమా: నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థతో కలిసి సౌందర్య రజనీకాంత్‌కు చెందిన మే 5 ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం లవ్. అర్జున్‌దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు ఈ ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం, డేటింగ్ యాప్‌లలో అది ఎలా మారిపోతోంది అనే కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రం అని చెప్పారు. నేటి డేటింగ్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ చిత్ర కథ ఉంటుందన్నారు. నెట్ ఫ్లిక్స్, సౌందర్య రజనీకాంత్ చెందిన మే 5 ఎంటర్‌టైనర్‌మెంట్ సంస్థలతో కలిసి పనిచేయడం, ఈ తరం ప్రేక్షకులకు ఈ అందమైన కథను అందించడానికి పూర్తి స్వేచ్ఛ లభించింది అన్నారు. అర్జున్ దాస్ మాట్లాడుతూ నేటి తరం అనుబంధాలను అందంగా ఆవిష్కరించే కథా లవ్ అని అన్నారు. డేటింగ్ యాప్ చుట్టూ రూపొందించిన ఐటీ స్టార్టప్ నేపథ్యంలో సాగే కథా చిత్రం ఇదని చెప్పారు. స్వైప్స్ మ్యాచ్, స్పీడ్ న్యూస్ యుగంలో ప్రేమ భిన్న మనస్తత్వాలు కలిగి ఇద్దరిని కలిసేలా చేస్తుంది, వారు జీవితంలో ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి వంటి విషయాలను దర్శకుడు బాలాజీమోహన్ ఎంతో పరిశోధించి రూపొందించిన చిత్రం లవ్ అని ఐశ్వర్యలక్ష్మి తెలిపారు.