
కొత్త పింఛన్ పథకాన్ని రద్దు చేయాలి
వేలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పింఛన్ పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని తమిళనాడు అన్ని ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ సమావేశం వేలూరులోని సంఘం కార్యాలయంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి జనవరి ఒకటవ తేదీ నుంచి ఉద్యోగులకు దాని ప్రయోజనాలను అందించనుంది. అదే తరహాలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా వెంటనే ఐదవ వేతనం, ఎనిమిదవ వేతన సంఘాలను ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ సమానంగా అందే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం జూలై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని అందజేస్తుందని, ఇదే తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదన్నారు. అనంతరం సమావేశాలను సభ్యులు తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లనున్నట్లు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా గౌరవాధ్యక్షుడు తాండవమూర్తి, జిల్లా ప్రచార కార్యదర్శి బాలక్రిష్ణన్, ఉపాధ్యక్షుడు జయపాల్, నిర్వాహకులు మునస్వామి, మదన్‌కుమార్ పాల్గొన్నారు.