
26న తెరపైకి శరీరం!
తమిళసినిమా: పవిత్రమైన ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రం శరీరం. జీవీపీ పిక్చర్స్ పతాకంపై జీవీ పెరుమాళ్ కథ దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను నిర్వహించిన చిత్రం ఇది. నూతన జంట దర్శన్ ,చార్మి హీరోహీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జె.మనోజ్, బాయ్స్‌రాజన్, షకీలా, మధుమిత, పుదుపేట్టై సురేష్, గౌరీ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకున్న శరీరం చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శక నిర్మాత జీవీ.పెరిమాళ్ కోరుకుంటూ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా శరీర ఆకృతిని రూపొందిస్తారన్నారు. దాని అందం ఎవరికీ అర్థం కాదన్నారు. అదేవిధంగా తమ శరీరాన్ని మార్చుకోవడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. ఈ విషయాన్ని బలంగా చెప్పే యూత్‌ఫుల్ ప్రేమకథా చిత్రంగా శరీరం ఉంటుందన్నారు. ఇంతకుముందు పలు చిత్రాల్లో అవయవాలను త్యాగం చేయడం చూశామన్నారు. అయితే తమ శరీరాలనే త్యాగం చేస్తున్న ప్రేమజంట కథ ఇదేనని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను చిత్తూరుతోపాటు, వేలూరు, బెంగళూరు, పాండిచ్చేరి ,మహాబలిపురం, కోవలం, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించి 65 రోజుల్లో పూర్తిచేసినట్లు చెప్పారు. వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రానికి భారతీరాజా సంగీతాన్ని, దోర్నల భాస్కర్, భరణికుమార్ ద్వయం చాయాగ్రహణం అందించినట్లు చెప్పారు.
శరీరంలో దర్శన్, చార్మి