
సముద్ర సాంకేతికతలో అనూహ్య పురోగతి
కొరుక్కుపేట: భారతదేశం సముద్ర సాంకేతికతలో వేగంగా పురోగతి సాధిస్తుందని నేషనల్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆర్. బాలాజీ అన్నారు. ఈ మేరకు ఈనెల 14 నుండి 18వ తేది వరకు ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో 7వ అంతర్జాతీయ ఓషన్ ఇంజినీరింగ్ కాన్ఫరెనన్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు, రక్షణ సంస్థలు మరియు ఆవిష్కర్తలను ఒకచోట చేర్చి రక్షణ సాంకేతికతలు, ఆఫ్‌షోర్ టెక్నాలజీ, సముద్ర శక్తి, రోబోటిక్స్, నీలి ఆర్థిక వ్యవస్థ , పెట్రోలియం ఇంజినీరింగ్ వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఐదు రోజుల పాటూ జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ నిపుణుల కీలక ఉపన్యాసాలు, 100 కంటే ఎక్కువ పీర్–రివ్యూడ్ టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్లు, ప్యానెల్ చర్చలు, పరిశ్రమ ప్రదర్శన, కెరీర్ ప్రారంభ దశలో ఉన్న పరిశోధకులు , విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్‌లు చేపట్టారు . ఉన్నాయి. సమావేశంలో డాక్టర్ ఆర్. బాలాజీ మాట్లాడుతూ భారతదేశం సముద్ర సాంకేతికతలో వేగంగా పురోగతి సాధిస్తోందన్నారు. డీఆర్‌డీవో రిసోర్స్ అండ్ మేనేజ్‌మెంట్ డాక్టర్ మను కొరుల్ల్లా మాట్లాడుతూ జాతీయ భద్రత సాంకేతిక స్వావలంబన రెండింటికీ మహాసముద్రాలు కీలకం అన్నారు. భారతదేశ వ్యూహాత్మక భవిష్యత్తుకు కీలకమైన నీటి అడుగున వ్యవస్థలు, నిఘా, స్థితిస్థాపక ఆఫ్‌షోర్ సాంకేతికతలు వంటి రంగాలలో రక్షణ, విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి రావడానికి,ఆవిష్కరణలను నడిపించడానికి ఐవోసీఈ –2025 సమావేశం ఒక వేదికగా నిలిచిందన్నారు. డీఆర్‌డీవో ఎన్‌పీవోఎల్ డైరెక్టర్ డాక్టర్ దువ్వూరి శేషగిరి మాట్లాడుతూ ఓషన్ ఇంజినీరింగ్ శక్తి , మౌలిక సదుపాయాలలో మాత్రమే కాకుండా జాతీయ భద్రత , వ్యూహాత్మక అనువర్తనాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నారు .