
రోడ్డు విస్తరణ పనులతో భవనాల కూల్చివేత
తిరువళ్లూరు: తిరువళ్లూరు–ఊత్తుకోట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపులా వున్న భవనాలను అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. తిరువళ్లూరు–ఊత్తుకోట రోడ్డు విస్తరణ పనులను అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా వున్న భవనాలను కూల్చివేయడంతో పాటూ భూసేకరణ చేపట్టారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో విస్తరణ పనులు నిలిచిపోయింది. ఈక్రమంలో భవన యజమానులకు పరిహారం అందించినా ఇంత వరకు ఖాళీ చేయకపోవంతో అధికారులు బుధవారం ఉదయం పోలీసుల సాయంతో కట్టడాలు తొలగించారు. ఈ సమయంలో భవన యజమానులు, పోలీసులు రెవెన్యూ ఉద్యోగులకు మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే భారీ పోలీసు బందోబస్తు నడుమ కట్టడాలను తొలగించారు.
వేడుకగా డీఎంకే నేత పుట్టినరోజు
పళ్లిపట్టు: డీఎంకే పళ్లిపట్టు మండల మాజీ కార్యదర్శి పి.రవీంద్రనాఽథ్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలురువు శుభాకాంక్షలు తెలిపారు. వెలిగరం గ్రామంలోని రవీంద్రనాఽథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పళ్లిపట్టు నార్త్ మండల కార్యదర్శి సీజే.శ్రీనివాసన్, పట్టణ కార్యదర్శి సెంథిల్‌కుమార్, సెంట్రల్ మండల కార్యదర్శి బీడీ చంద్రన్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

రోడ్డు విస్తరణ పనులతో భవనాల కూల్చివేత