
మదరాసి చిత్రానికి శంకర్ ప్రశంసలు
తమిళసినిమా: నటుడు శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మదరాసి. నటి రుక్మిణి వసంత్ నాయకి నిర్మించిన ఇందులో విద్యుత్ జమ్వాల్, బిజీ మీనన్, డాన్సింగ్ రోస్, సబీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ మురుగదాస్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా స్టార్ డైరెక్టర్ శంకర్ మదరాసి చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తన ఎక్స్ వీడియోలో పేర్కొంటూ మదరాసి చిత్రం పలు ఆసక్తికరమైన, నాటకీయ సంఘటనలతో కూడిన కథాంశంతో రూపొందిన చిత్రం అన్నారు. అందమైన వాణిజ్య అంశాలతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ కథా చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చక్కని సందేశం, భావోద్రేకాలను చక్కగా తెరపై ఆవిష్కరించారన్నారు. ప్రేమ మార్గాన్ని, నేరబాటను కలిపి అద్భుతంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారన్నారు. శివ కార్తికేయన్ పాత్ర చాలా భవిష్యభరితంగా ఉందన్నారు. దాన్ని ఆయన అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా శివకార్తికేయన్ అందర్నీ భ్రమింపచేశారన్నారు. అనిరు నేపథ్య సంగీతం చిత్రానికి బలాన్ని చేకూర్చిందని ప్రశంసించారు. కాగా శంకర్ ప్రశంసలకు మదరాసి చిత్ర నిర్మాత కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
కల్యాణి ప్రియదర్శన్