
రైలులో మత్తుమాత్రలు తరలింపు
–నలుగురి అరెస్ట్
తిరువళ్లూరు: రైలులో మత్తు మాత్రలను తరలించిన నలుగురిని స్పెషల్‌టీ మ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 3,200 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి, మత్తుమాత్రలు, గుట్కా అక్రమంగా తరలించే వారిని కట్టడి చేయడానికి ఎస్పీ వివేకనందశుక్లా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా వుంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రైలులో మత్తుమాత్రలను తరలిస్తున్నట్టు నిఘా టీమ్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రన్‌కు సమాచారం అందింది. పోలీసులు తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఆసమయంలో అనుమానాస్పదంగా రైలులో ప్రయాణిస్తున్న నలుగురి బ్యాగులను తని ఖీ చేశారు. అందులో 1.60 లక్షలు విలువ చేసే 3,200 మత్తు మత్తుమాత్రలు వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకులు చైన్నె బెసెంట్‌నగర్‌కు చెందిన దురైరాజ్(25), నటరాజన్(26) ఊరపా క్కం ప్రాంతానికి చెందిన విజయ్(22), తిరువాన్మియూర్‌కు చెందిన ఏలుమలై(29)గా గుర్తించారు. వీరు ఆంధ్రా నుంచి మత్తుమాత్రలను తీసుకొచ్చియువకులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు నిర్ధారించారు. అనంతరం నలుగురిని అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించడంతోపుళల్ జైలుకు తరలించారు.