తమిళ సినిమా: యాక్టివ్ సినీ యాక్టివ్ నిర్మాతల మండలి కార్యవర్గానికి ప్రతి మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రస్తుత కార్య నిర్వాహకం గడువు పూర్తిగా కావడంతో నూతన కార్యవర్గ సంఘాన్ని ఆదివారం ఎంపిక చేశారు. అయితే అధ్యక్ష పదవికి ఫిలిమ్స్ సత్యజ్యోతి ఫిలిమ్స్ అధినేత టీజీ త్యాగరాజన్‌తో పాటు ఇతర నిర్వాహకులు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ నూతన వర్గ కార్యవర్గంలో అధ్యక్షుడిగా సత్యజ్యోతి ఫిలిమ్స్ టి.జి త్యాగరాజన్ కార్యదర్శిగా టి.శివ, ఉపాధ్యక్షులుగా ఎస్‌ఆర్ ప్రభు, ఎస్‌ఎస్ లలిత్‌కుమార్, కోశాధికారిగా ధనుంజయన్, ఉపకార్యదర్శులుగా ముఖేష్ ఆర్.మెహతా, ఎస్.వినోద్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా దర్శకుడు కేఎస్ రవికుమార్, సుందర్.సి, ఎస్.లక్ష్మణ్ కుమార్, సుధన్ సుందరం, కమల్ మోహారా, కార్తికేయన్ సంతానం, నటుడు నితిన్ సత్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ నిర్మాతల మండలికి సీనియర్ దర్శకుడు భారతీరాజా గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.