
వాగు దాటుతూ వ్యక్తి మృతి
తిరువళ్లూరు: వాగు దాటడానికి యత్నించిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటి ఉధృతిలో కొట్టుకపోయి మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ మేట్టు కాలనీకి చెందిన తాపీమేసీ్త్ర శ్రీధరన్(52)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఆదివారం రాత్రి తామరపాక్కం టాస్మాక్ దుకాణానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మాగరల్ వద్ద ఉన్న వాగును దాటే క్రమంలో నీటి ఉధృతికి కొట్టుకపోయి సోమవారం ఉదయం శవమై తేలాడు. స్థానికులు విషయాన్ని వీఏఓకు తెలియజేయడంతో సంఘటనాస్థలానికి వచ్చిన అధికారులు మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన వ్యక్తి శ్రీధరన్‌గా గుర్తించిన తరువాత అతడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.