
మీతో స్టాలిన్‌ను సద్వినియోగం చేసుకోండి
వేలూరు: మీతో స్టాలిన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేవీ కేప్పం యూనియన్ చైర్మన్ రవిచంద్రన్ అన్నారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం యూనియన్ పరిధిలోని లత్తేరి, అన్నంగుడి గ్రామ పంచాయతీలకు సంబంధించి మీతో స్టాలిన్ పథకం లత్తేరిలోని ప్రయివేటు కల్యాణ మండపంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం14 శాఖలకు సంబంధించిన అధికారులను ఒకే తాటిపైకి చేర్చి ప్రజల సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి వెంటనే పరిష్కరించేది తమ ప్రభుత్వమే అన్నారు. ఇటువంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చే వినతులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా అనే వాటిపై తనిఖీ చేశారు. యూనియన్ వైస్ చైర్మన్ జయ మురుగేషన్, యూనియన్ కార్యదర్శి సీతారామన్, దివ్య శివకుమార్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.