వేలూరు: విద్యార్థులకు సైన్స్ పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు టీచర్లు శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌బాబు అన్నారు. వేలూరు ధనభాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్ మహిళా డిగ్రీ కళాశాలలో తమిళనాడు సైన్స్ ఉద్యమం 34వ బాలల సైన్స్‌పై సదస్సు, టీచర్‌లకు శిక్షణ తరగతులు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ శిక్ష ణను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి మొదటి విడతగా జిల్లాలోని 200 మంది సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందిన టీచర్లు 10 నుంచి 17 సంవత్సరాలలోపు విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించి పరిశోధనలు చేయడానికి ఆశక్తి చూపాలన్నారు. అనంతరం సదస్సు పుస్తకాన్ని అవిష్కరించారు. డీకేఎం మహిళా డిగ్రీ కళాశాల కార్యదర్శి మణినాథన్, ప్రిన్సిపల్ భానుమతి, సైన్స్ ఉద్యమ కార్యదర్శి జనార్దన్, ప్రొఫెసర్ అముద, జిల్లా సమన్వయ కర్త శ్రీనివాసన్, ప్రొఫెసర్ దేవి, కార్యదర్శి ముత్తు, సిలుప్పన్, కోశాదికారి శేఖర్ పాల్గొన్నారు.