
విద్యుత్ సేవలకు శ్రీకారం
తిరుత్తణి: తిరుత్తణి యూనియన్ బుచ్చిరెడ్డిపల్లె గ్రామంలో లో ఓల్టేజ్ సమస్యతో పాటు వర్షాకాలంలో విద్యుత్ కోతలతో గ్రామీణులు ఇబ్బందులు చెందేవారు. దీంతో నేతపరిశ్రమకు అడ్డంకిగా మారి కార్మికులు జీవనోపాధి దెబ్బతినేది. విద్యుత్ సమస్య పరిష్కరించే విధంగా విద్యుత్ లైన్లు మార్చి బుచ్చిరెడ్డి పల్లెకు నేరుగా సరఫరా చేయాలని కోరారు. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు చిరుగుమి, భాగవతాపురం మార్గంలో కొత్తగా 75 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ లైన్ లాగారు. దీంతో మంగళవారం కేజీ.కండ్రిగ విద్యుత్ సబ్ స్టేషన్‌లో 11 కేవీ సామర్థ్యం నిండిన ప్రాంతంతో కొత్త విద్యుత్ లైను జత కలిపి విద్యుత్ సేవలు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని విద్యుత్ సేవలను ప్రారంభించారు. గ్రామీణుల చాలా కాలం కోరక నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి నేత కార్మి కులు తమ కృతజ్ణతలు తెలిపారు.