
ధీరన్‌కు ఘన నివాళులు
●సీఎం పుష్పాంజలి
సాక్షి, చైన్నె: స్వాతంత్య్ర సమరయోధుడు ధీరన్ చిన్నమలైకు ఆదివారం సీఎం స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. ధీరన్ చిన్నమలై 220వ వర్ధంతి సందర్భంగా చైన్నె, ఈరోడ్, నామక్కల్‌లలో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలు పార్టీల నేతలు అంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమరంలో ధీరన్ చిన్నమలై వీరోచిత పోరాటం అజరామరం. ఆయన్ను స్మరించే విధంగా చైన్నె గిండి తిరువీకా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో గుర్రుంపై ధీరన్ స్వారీ చేస్తున్నట్టుగా విగ్రహాన్ని కొలువు దీర్చి ఉన్నారు. ఇక్కడ ఉదయం సీఎం స్టాలిన్, మంత్రులు శేఖర్‌బాబు, ఎం సుబ్రమణియన్, స్వామినాథన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, మేయర్ ప్రియ తదితరులు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన సేవలను నెమర వేసుకున్నారు. అనంతరం అన్నాడీఎంకే నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు తంబిదురై, జయకుమార్, పొన్నయ్యన్, గోకుల ఇందిరా తదితరులు పుష్పాంజలి ఘటించారు. అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరనన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్‌తో పాటూ పలు పార్టీల నేతలు నివాళులర్పించారు. ఇక ఈరోడ్, నామక్కల్‌లలోని ధీరన్ చిన్నమలై స్మారక మందిర, మణి మండపంలలో పలు పార్టీల నాయకులు అంజలి ఘటించారు. బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, అన్నాడీఎంకే మాజీ మంత్రి తంగమణిలతో పాటూ పలు వురు నేతలు నివాళులర్పించారు. చైతన్య యాత్రలో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తిరునల్వేలిలో ధీరన్ చిన్నమలై చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

ధీరన్‌కు ఘన నివాళులు

ధీరన్‌కు ఘన నివాళులు