అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం

Aug 3 2025 3:20 AM | Updated on Aug 3 2025 3:20 AM

అందరి

అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం

అందరికీ ఉన్నత వైద్యాన్ని దరిచేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం బృహత్తర పథకాలతో ఆరోగ్య సంరక్షణలో నెంబర్‌–1 దిశగా

ముందు కెళ్తున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఈమేరకు నలం

కాక్కుం స్టాలిన్‌ వైద్య శిబిరాల పథకానికి

శనివారం ఆయన శ్రీకారం చుట్టారు.

సాక్షి, చైన్నె : ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా వైద్య శిబిరాల నిర్వహణ లక్ష్యంగా నలం కాక్కుం స్టాలిన్‌ పేరిట పథకాన్ని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్య ప్రజారోగ్య శాఖ తరపున చైన్నె, శాంతోమ్‌, సెయింట్‌ పీట్స్‌ ఆంగ్లో ఇండియన్‌ మాధ్యమిక పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్‌ హెల్త్‌ కేర్‌ ప్రత్యేక వైద్య శిబిరాల పథకానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, ఇటీవల తాను వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో తల తిరిగినట్టు అనిపించి ఆస్పత్రికి వెళ్లినట్టు గుర్తు చేశారు. వైద్యులు కొన్ని పరీక్షలు చేయాలని సూచించడంతో ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా, ప్రభుత్వ అధికారులతో తాను సంప్రదింపులు కొనసాగిస్తూ, కొన్ని అత్యవసర ఫైళ్లను చూడడం జరిగిందన్నారు. అలాగే మీతో స్టాలిన్‌ విజ్ఞప్తుల స్వీకరణ గురించి ప్రత్యేక దృష్టి పెట్టానని పేర్కొన్నారు.

అలాగే, తూత్తుకుడికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు సమస్యలతో వినతిపత్రం కూడా అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికీ, ప్రజలే తనకు ముఖ్యం అని పేర్కొంటూ, సచివాలయానికి వెళ్లగానే ఈ పథకం అమలు మరో వారం రోజులు వాయిదా వేయాలని అధికారులు సూచించారని, అయితే, తాను వెనక్కు తగ్గ లేదని, ముందడుగు వేయడంతో ఇప్పుడు, ఇక్కడ, ఈ రోజు వైద్య శిబిరాల పథకం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. తాను ప్రజలను కలిసేందుకు ఉత్సాహాంగా ఉన్నట్టు అధికారులకు నచ్చ చెప్పినట్టు, ప్రజల వద్దకు వచ్చినప్పుడు తనకు మరింత ఉత్సాహం వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ప్రజల ప్రయోజనాలను కాపాడే కార్యక్రమం అని, గుర్తు చేస్తూ కరోనా కాలంలో తాను అధికార పగ్గాలు చేపట్టానని పేర్కొంటూ, అప్పటి పరిస్థిలు, నివారణకు యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలను వివరించారు.

ప్రజా శ్రేయస్సే ముఖ్యం

కరోనా పరిస్థితుల అనంతరం ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ అనేక వైద్య పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నానని , ఆరోగ్య మంత్రిగా ఎం సుబ్రమణియన్‌ నిరంతరం శ్రమిస్తుఅందరి చేత పనులు చేయిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఈ ఒక్క రోజు 1256 ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించామని, ప్రతి శిబిరంలో, వైద్యుల సహా 200 మంది సిబ్బంది 17 రకాల ప్రత్యేక వైద సేవలను అందించడం జరిగిందన్నారు. అన్ని పరీక్షలతో కూడిన నివేదికను వైద్య రికార్డులతో పొందు పరిచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. తమిళనాడు విషయంలో వైద్య మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని, ఆసుపత్రికి రాలేని వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరాలు తోడ్పాటుగా మారినట్టు వివరించారు. ఈ శిబిరాలకు వచ్చే వారికి అన్ని రకాల వివరాలను, సేవలను పూర్తి స్థాయిలో అందించే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంపై వైద్యుల, సిబ్బంది దృష్టి పెట్టాలని, ఈ శిబిరాలలో మీ భాగస్వామ్యం కీలకం అని వ్యాఖ్యలు చేశారు. అన్నింటా తమిళనాడు నెంబర్‌ వన్‌గా ఉండాలని తాను ఆకాంక్షిస్తుంటానని పేర్కొంటూ, అందరికీ మెరుగైన, ఉన్నత వైద్యం దరిచేరే విధంగా వైద్యంలోనూ నెంబర్‌–1 కావడమే లక్ష్యంగా ముందుడుగు వేస్తున్నట్టు ధీమా వ్యక్తంచేశారు. కాగా, ఈ పథకం గురించి సమగ్ర వివరాలను, ప్రతి శనివారం జరిగే శిబిరాల గురించి ప్రభుత్వం తరపున మీడియా కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె. రాధాకృష్ణన్‌, ఆరోగ్య కార్యదర్శి సెంథిల్‌కుమార్‌లు మీడియాకు వివరించారు. అంటువ్యాధి కాని వ్యాధులు అతిపెద్ద సవాళ్లుగా గుర్తించామని పేర్కొంటూ, అందరికీ ఉన్నత వైద్య దిశగా సీఎం ఆదేశాలతో పథకం అమలు విస్తృతం కానున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌, మంత్రి ఎం సుబ్రమణియన్‌, శే ఖర్‌బాంబు , సీఎస్‌ మురుగానందం, మేయర్‌ ప్రియ తదితరులు పాల్గొన్నారు. కాగా, అనంతరం సీఎంస్టాలిన్‌డీఎంకే కార్యాలయానికి చేరుకుని నియోజకవర్గాల నేతలతో సోదరా కదిలిరా నినాదం మేరకు చర్చల్లో మునిగారు. అలాగే, విల్లుపురం జిల్లా దిండివనంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబానికి సీఎం స్టాలిన్‌ పది లక్షలు చెక్కును అందజేశారు.

ఆరోగ్య సంరక్షణలో నెంబర్‌–1

సీఎం ఎంకే స్టాలిన్‌

నలం కాక్కుం స్టాలిన్‌ వైద్య శిబిరాలకు శ్రీకారం

అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం1
1/2

అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం

అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం2
2/2

అందరికీ ఉన్నత వైద్యమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement