
శింబు 49వ చిత్రం అదే..!
తమిళసినిమా: వివాదాలకు కేరాఫ్ శింబు అంటారు. అయితే ఆయన వర్గం మాత్రం ఆయనంత మంచి వాడు లేడంటారు. ఏదేమైన శింబుకు మాత్రం సంచలన నటుడు అనే ముద్ర మాత్రం పడింది. కారణం ఈయన నటించే ప్రతి చిత్రం సంచలనంగా మారుతుండటమే. ఇకపోతే ఈయన మంచి హిట్ చూసి చాలా కాలమే అయ్యిందని చెప్పవచ్చు.ఇ టీవల మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్‌లైఫ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా , విడుదలయిన తరువాత ఆ చిత్రం రిజల్డ్ పూర్తిగా నిరాశ పరిచింది. అదే విధంగా ఇప్పుడు శింబు వరుసగా చిత్రాలను కమిట్ అయ్యారని, ఆయన చేతిలో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వాటిలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించే చిత్రం గురించి ఇప్పుడు రకరకాల ప్రచారం ట్రోలింగ్ అవుతోంది. వెట్రిమారన్ ఇంతకు ముందు ధనుష్ హీరోగా వడచైన్నె వంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌ను శింబుతో చేస్తున్న చిత్రం అనే ప్రచారం జరింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, అదే నేపధ్యంలో జరిగే వేరే కథ ఇదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. కాగా ఇది శింబు నటిస్తున్న 49వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయినట్లు సమాచారం. అయితే ఈ చిత్ర షూటింగ్ సాఫీగా సాగడం లేదని, అందుకు చిత్ర బడ్జెట్ పెరగడమేని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే విధంగా శింబు పారితోషికాన్ని పెంచడం కూడా ఇందుకు ఓ కారణం అనే ప్రచారం వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను యూనిట్ సభ్యులు విడుదల చేయడంం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఆగస్ట్ 2న విడుదల చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా ఈ క్రేజీ చిత్రంలో శింబు ద్విపాత్రాభిన యనం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు, దర్శకుడు సముద్రఖని, కిశోర్, ఆండ్రియా, దర్శకుడు నెల్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన ఆగస్ట్ 2న వెలువడే అవకాశం ఉంది.