
రెండవ ఘాట్‌రోడ్డు పనుల తనిఖీ
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు రెండవ ఘాట్‌రోడ్డు ఏర్పాటుకు సంబంధించి హైవేశాఖ సూపరింటెండెంట్ బుధవారం తనిఖీ చేశారు. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వాహనాల్లో వచ్చి స్వామి దర్శనం చేస్తుంటారు. వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి అధికమిస్తున్న క్రమంలో ఘాట్‌రోడ్డులో వాహనాల రద్దీ నెలకొంటోంది. కొండకు ఒకే ఘాట్‌రోడ్డు వుండడంతో వాహనాలు ట్రాఫిక్ వలయంలో చోటుచేసుకుని భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల సౌకర్యార్థ్యం, వాహన సమస్యలు పరిష్కరించే విధంగా రెండవ ఘాట్‌రోడ్డు నిర్మించాలని భక్తులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రెండవ ఘాట్‌రోడ్డు నిర్మాణానికి తిరుత్తణి ఆలయ అధికారులు నిర్ణయం తీసుకుని 1200 మీటర్ల పొడవున రెండవ ఘాట్‌రోడ్డు నిర్మాణంకు సంబంధిం రూ. 32.50 కోట్లు ఆలయ నిధులు ద్వారా పనులకు చర్యలు తీసుకున్నారు. హైవేశాఖ ద్వారా ఘాట్‌రోడ్డు పనులు చేపట్టేందుకు వీలుగా రూపొందించిన మ్యాప్ సాయంతో కొండ ఆలయ ఘాట్‌రోడ్డులో హైవేశాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు శరవణ సెల్వన్ తనిఖీ చేశారు. హైవేశాఖ డివిజినల్ ఇంజినీరు చిట్రరసు, తిరుత్తణి డివిజన్ సహాయ ఇంజినీరు రఘురామన్ పాల్గొన్నారు.