
స్వదేశీ ఈవీ చార్జింగ్ ప్లాట్‌ఫాం అభివృద్ధి
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు –ఇంక్యుబేట్ చేసిన స్మార్ట్ ఈవీ చార్జర్ కంపెనీ ఫ్లగ్స్‌మార్ట్ స్వదేశీ ఈవీ చార్జింగ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఇది బహుళ సీఎంఎస్ నెట్‌వర్క్‌లకు చార్జర్ లను కనెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించడం విశేషం. ఇది ఒకే ఈవీ చార్జర్ బహుళ చార్జింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లకు (సీఎంస్) ఏకకాలంలో కనెక్ట్ అవ్వడానికి అనుమతి ఇస్తుండడం గమనార్హం. ప్రస్తుతం, చాలా ఈవీ చార్జర్లు ఒక ఈవీకి లాక్ చేశారు, అంటే ఆ ఒక ఈవీబ్రాండ్ వినియోగదారులు మాత్రమే చార్జర్‌ను వినియోగించగలరు. ఈక్రమంలో ఫ్లగ్‌మార్ట్ సంస్థ దీనికి పరిష్కారంగా ఒకే చార్జర్ కోసం మిడిల్‌వేర్‌ను పరిచయం చేసి ఈ పరిమితిని బద్ధలు కొట్టిందని ప్లగ్స్ మార్ట్ సాఫ్ట్‌వేర్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ శ్రీ రాఘవేందర్ టీఎస్ తెలిపారు ప్రభుత్వ విధానాలు, స్థిరత్వ లక్ష్యాలు, సమర్థవంతమైన ఇంధన నిర్వహణ అవసరం కారణంగా భారతదేశంలో ఈవీ రంగం వేగంగా విస్తరిస్తోందని, చార్జింగ్ మౌలిక సదుపాయాల మార్కెట్ విపరీతంగా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.