
కీలడి నివేదికకు పట్టు!
సాక్షి, చైన్నె: తమిళ సంస్కృతికి దర్పణంగా మారిన కీలడి నివేదికను బట్ట బయలు చేయాలని కేంద్రాన్ని పట్టుబడుతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తెలిపారు. ఈ వ్యవహారంలో డీఎంకే ప్రభుత్వం చేపట్టేచర్యలకు తాము మద్దతు ఇస్తామన్నారు. తమిళనాడును, ప్రజలను రక్షిద్దామని పళణి స్వామి చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బుధవారం శివగంగై జిల్లా తిరుబువనంకు చేరింది. ఇటీవల తిరుబువనంలో పోలీసుల లాకప్ డెత్‌లో మరణించిన అజిత్‌కుమార్ కుటుంబాని పళణి స్వామి పరామర్శించారు. అన్నాడీఎంకే తరపున రూ. 5 లక్షలు చెక్కును అందజేశారు. అనంతరం ఆయన కీలడిలో పురావస్తు పరిశోధనల ఎగ్జిభిషన్‌ను సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పురావస్తు తవ్వకాలు, ఇప్పటి వరకు బయట పడ్డ అనేక ఆధారాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వ అసమర్థత కారణంగా అన్ని విభాగాలు అస్తవ్యస్థంగా మారి ఉన్నాయని ధ్వజమెత్తారు. కీలడిలో జరిగిన పురావస్తు పరిశోధనలకు సంబంధించిన నివేదిక విషయంగా ప్రస్తావిస్తూ, ఈ వ్యవహారంలో కేంద్రం వద్ద పట్టుబడుతామన్నారు. ఈ నివేదికను బయట పెట్టాలని కోరుతామన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం డీఎంకే చేపట్టే చర్యలకు తాము మద్దతు ఇస్తామని వ్యాఖ్యలు చేశారు. కీలడి పురవాస్తు ఆధారాలన్నీ తమిళ సంస్కృతికి దర్పణాలు అని, తమ హయాంలో ఇక్కడి అంశాలతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి ఉన్నామని వివరించారు.