
ఆరు నగరాల్లో..
కీలక ఒప్పందాలు..
రాష్ట్రంలో చైన్నెతో పాటూ ఆరు నగరాలలో పారా క్రీడా మైనదాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. చైన్నెలో ఏర్పాటు చేస్తున్న పారా బ్యాడ్మింటన్ కోర్టు పనులకు చర్యలు తీసుకున్నారు. ఈ పనులను మంగళవారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పరిశీలించారు. అలాగే నాన్ మొదల్వన్ ప్రాజెక్టు కింద కంప్యూటర్, సైన్స్ స్ట్రీమ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల కోసం తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుంది.
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జాతీ, అంతర్జాతీయ క్రీడలకు తమిళనాడు వేదిక కావాలనే లక్ష్యంతో క్రీడా పరంగా నిర్మాణాలు విస్తృతం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పాఠశాల,కళాశాల స్థాయిలో క్రీడాకారులను బలోపేతం చేసే విధంగా సీఎం టోర్నీ పోటీల నిర్వహణ ఏటా నిర్వహిస్తూ, అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో అనేక మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ పోటీలలో రాణిస్తూ పతకాలతో తమిళనాడుకు తిరిగి వస్తున్నారు. వీరిని మరింత ప్రోత్సహించే విధంగా నగదు బహుమతులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. నియోజకవర్గానికి ఒక మైదానం, నగరానికి ఒక క్రీడా అకాడమి అంటూ వివిధ నిర్మాణాలను వేగవంతం చేశారు. చైన్నె శివారులో క్రీడా నగరం రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పారా క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడల శాఖ, తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా చైన్నె, తిరుచ్చి,మదురై, కడలూరు, తిరునల్వేలి, సేలం నగరాలలో పారా స్పోర్ట్స్ మైదానాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు.
నెహ్రూ పార్క్‌లో..
చైన్నెలోని నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పారా బ్యాడ్మింటన్ కోర్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. తిరుచ్చి, మధురై, కడలూరు, తిరునెల్వేలి, సేలంలలో పారా స్పోర్ట్‌క్రీడా సముదాయాలు కొలువు దిర్చేందుకు స్ధిమయ్యారు. అర్ధవృత్తాకారంలో ఓపెన్ ఎయిర్ రూప్డ్ సీటింగ్‌తో పారా వాలీబాల్ కోర్ట్, పారా బాస్కెట్ బాల్ కోర్ట్, పారా బాల్ త్రోయింగ్ పిచ్ వంటి సదుపాయాలతో, పరిపాలన కార్యాలయం భవనం, క్రీడా సామాజిక నిల్వకు ప్రత్యేక గది, చక్రాల బండి, పురుషులు, మహిళలకు కుర్చీలతో కూడిన ర్యాంప్, తదితర సౌకార్యలను కల్పించేందుకు సిద్ధమయ్యారు. చైన్నె కిల్పాక్‌లోని నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రూ. 2.38 కోట్ల వ్యయంతో పారా బ్యాడ్మింటన్ మైదానం పనులను మంగళవారం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పరిశీలించారు. పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇతర నగరాలలో తలా రూ. కోటి విలువతో పారా మైదానాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం రూ.7.38 కోట్లు ఖర్చుతో పారా స్పోర్ట్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు వేగవంతం చేయనున్నారు. చైన్నెలోని నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అర్థ వృత్తాకారంలో ఓపెన్ ఎయిర్ పారా పెట్ , బ్యాడ్మింటన్ కోర్టు, సిట్టింగ్ పారా వాలీ బాల్ కోర్టు, పారా టేబుల్ టెన్నిస్ కోర్టు, పారా టైక్వాండో ఫీల్డ్, పారా జూడో ఫీల్డ్, పారా గోల్‌బాల్ పిచ్, పారా–వెయిట్ లిఫ్టింగ్‌తదితర క్రీడలకు అవసరమైన అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌కు తమిళనాడు స్పోర్ట్స్‌అ థారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి అన్ని వివరాలను తెలియజేశారు. త్వరితగతిన పనులు ముగించాలని, అన్ని రకాల వసతులు ఉండాలని ఈసందర్భంగా క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రాతో పాటుగా జే మేఘనాథరెడ్డిలను ఉదయ నిధి స్టాలిన్ ఆదేశించారు.
ఉదయ నిధి స్టాలిన్ సమక్షంలో ఒప్పందాలు
పారా బ్యాడ్మింటన్ కోర్టు పనులను పరిశీలిస్తున్న ఉదయనిధి, చిత్రంలో అతుల్య మిశ్ర, జె. మేఘనాథరెడ్డి
న్యూస్‌రీల్
నెహ్రూ స్టేడియంలో పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
నైపుణ్యాల పెంపునకు గూగుల్‌తో ఒప్పందాలు
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో నాన్ మొదల్వన్ ప్రాజెక్టు కింద కంప్యూటర్, సైన్స్ స్ట్రీమ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల కోసం గేమ్ డెవలపర్, కలైంజ్ఞర్ ప్రోగ్రామర్ నైపుణ్యాల శిక్షణ నిమిత్తం గ్లోబల్ కంపెనీ గూగుల్, యూనిటీ కంపెనీతో తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందాలు జరిగాయి. ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఇది ఒక గొప్ప ప్రయత్నంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం సంవత్సరానికి లక్ష మందికి పైగా ప్రయోజనం చేకూర్చనుంది. నైపుణ్య ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థులను పరిశ్రమలో ఉద్యోగ నిమిత్తం సన్నద్ధం చేయడం, మెరుగైన సమాజాన్ని సృష్టించే ఆదర్శవంతమైన లక్ష్యంతో కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. నాన్ మొదల్వన్ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం 13 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించగా, ఇప్పటివరకు సుమారు 41 లక్షల మందికి నైపుణ్య ఆధారిత ధృవీకరణ పత్రాలను అందించినట్టు అధికారులు ప్రకటించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్, ఐటీఐలకు సంబంధించిన విద్యార్థులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా విద్యా, సాంకేతికత, నిపుణులు, మార్గదర్శకులు, నిర్వాహకుల ద్వారా నైపుణ్యాలను అభివృద్ధిని విస్తృతం చేయనున్నాట్టు ప్రకటించారు. తాజాగా కొత్త యూనిటీ గేమ్ డెవలపర్ శిక్షణ కార్యక్రమం గూగుల్ ప్లే ప్రత్యేక సహకారంతో గేమ్ డిజైన్, అభివృద్ధి, ఆదాయ మార్గంతో పాటూ ఉచిత యూనిటీ లైసెన్స్, ఉచిత శిక్షణ, పరీక్షల తయారీ సెషన్లు, పరిశ్రమ నిపుణులతో సమావేశం , సంభాషణ స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్నవారికి అవకాశం, ఇంక్యుబేటర్ , పెట్టుబడుల అవకాశాలను కల్పించనున్నట్టు వివరించారు. ఈ నైపుణ్య శిక్షణను ఎంపిక చేసిన 250 మంది విద్యార్థులకు అందించనున్నట్టు, ఒక్కో విద్యార్థికి రూ. 32,000, శిక్షణ ధ్రువీకరణకు విలువైన యూనిటీ లైసెన్స్ అందించనున్నామని ప్రకటించారు. దీని మొత్తం విలువ రూ. 80,32,500గా ప్రకటించారు. ప్రపంచ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా 2029 నాటికి మరింతగా పెరుగుతుందని వివరించారు. సచివాలంయలో జరిగిన ఈ ఒప్పందాల కార్యక్రమంలో గూగుల్ ప్లే పార్టనర్‌షిప్స్, ఏపీఏసీ పార్టనర్, డైరెక్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ – ఎకోసిస్టమ్ పార్టనర్‌షిప్స్, గూగుల్ ఇండియా ప్లాట్ ఫామం, ప్రభుత్వ వ్యవహారాల విభాగం అధికారులు అతిథి చతుర్వేది, ప్రదీప్ యాదవ్, క్రాంతి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.