
అనుబంధ కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు
సాక్షి, చైన్నె: ఇంజినీరింగ్ కోర్సులకు అనుబంధ కౌన్సెలింగ్ నిమిత్తం ఉన్నత విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈమేరకు ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వివరాలు.. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ముగించి కౌన్సిలింగ్‌సాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కోటాలోని సుమారు రెండు లక్షల సీట్లు ఉండగా 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్‌కు 2 లక్షల 41 వేల 641 మంది అర్హత సాధించారు. తొలుత రిజర్వుడ్ కోటా క్రీడలు, దివ్యాంగులు, మాజీ సైనికులు తదితర సీట్ల భర్తీ జరిగింది. ఆ తదుపరి ఈనెల 14 నుంచి ఆగస్టు 19వ తేది వరకు జనరల్ కోటా సీట్ల భర్తీ జరుగుతూ వస్తున్నది. ఈ పరిస్థితలలో ఇప్పటి వరకు జరిగిన జనరల్ కోటా కౌన్సెలింగ్‌లో 98,565 మంది విద్యార్థులు తమకు కావాల్సిన కళాశాలలో కోర్సులను ఎంపిక చేసుకున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలో చదువుకున్న విద్యార్థులకు 7.5 శాతం రిజర్వుడ్ మేరకు 16259 మంది సీట్లను దక్కించుకున్నారు. ఈ పరిస్థితులలో అనుబంధ కౌన్సెలింగ్‌నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్లస్–2లో తప్పి, సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారు, ఇతర ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల కోసం ఎదురు చూసి సీట్లు దక్కక పోవడం, వంటి పరిణామాలతో ప్రత్యామ్నాయంగా ఇంజినీరింగ్ వైపుగా చూస్తున్న విద్యార్థులకు అనుబంధ కౌన్సిలింగ్‌లో అవకాశాలు కల్పించనున్నారు. ఈ అనుబంధ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగనుంది.