
ఆధునిక సాంకేతికతతో ‘కెప్టెన్ ప్రభాకరన్’
తమిళసినిమా: గతంలో విజయవంతమైన చిత్రాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. దీనికి కారణం ఆ చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందటం, కాసుల వర్షం కురిపించడమే. అలా 34 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయాన్ని సాధించిన కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం ఆ చిత్రం మళ్లీ 4 కే, డిజిటల్ ఫార్మేట్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగస్టు 22వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఇది విజయ్ కాంత్ నటించిన 100వ చిత్రం అన్నది గమనార్హం. ఆర్కే సెల్వమణి కథా, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్,నటి రూపిణీ, రమ్యకష్ణ ,మన్సూర్ అలీఖాన్, లివింగ్స్టన్, గాంధీమతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన విచిత్రం 1991 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైంది కాగా కెప్టెన్ ప్రభాకర్ సంచలన విజయాన్ని సాధించడంతోపాటూ విజయ్‌కాంత్‌కు కెప్టెన్ అనే పేరు సార్ధకం చేసింది. కథ విచిత్రాన్ని ఇప్పుడు స్పారో సినిమాస్ పోతాకంపై కార్తీక్ వెంకటేశం రాష్ట్రవ్యాప్తంగా 500 థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల విజయకాంత్ జయంతి సందర్భంగా వెల్లడించారు. ఆయన నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు ఆర్కే సెల్వమణి,డిఎండికే పార్టీ అధ్యక్షురాలు ప్రేమలత విజయకాంత్, కోశాధికారి ఎల్కే సుదీష్, దర్శకుడు విక్రమనచ, ఆర్వీ ఉదయ్ కుమార్, అరవిందరాజ్, పేరరసు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.