
తిరుత్తణి ఆలయ చైర్మన్‌గా శ్రీధరన్
తిరుత్తణి: తిరుత్తణి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌గా శ్రీధరన్ రెండో సారి పదవీ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. తిరుత్తణి ఆలయ చైర్మన్ శ్రీధరన్ ఆధ్వర్యంలోని పాలక మండలి పదవీ కాలం మే 31తో ముగియడంతో ఇటీవల హిందూ దేవదాయ శాఖ పాలక మండలి సభ్యులుగా సురేష్‌బాబు, శ్రీధరన్, ఉషారవి, మోహనన్, నాగన్‌లకు రెండో సారి అవకాశం కల్పించి, రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఐదుగురు సభ్యుల్లో ఒకరు చైర్మన్‌గా ఎంపికకు సంబంధించి తిరుత్తణిలోని జాయింట్ కమిషనర్ ఆలయంలో సోమవారం రహస్య ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ట్రస్టు బోర్డు సభ్యులు ఐదురుగు పాల్గొని, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రహస్య ఓటింగ్‌లో ఐదుగురు సభ్యులు చైర్మన్‌గా శ్రీధరన్‌ను ఎంపిక చేశారు. రెండవ సారిగా చైర్మన్‌గా ఎంపికై న శ్రీధరన్‌కు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టుబోర్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం చైర్మన్‌తోపాటు ట్రస్టు బోర్డు సభ్యులు ఆలయానికి వెళ్లి శ్రీసుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు.