
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
తిరువళ్లూరు: ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి బాధ్యతతో అందరూ ముందుకు రావాలని కలెక్టర్ ప్రతాప్ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా ఈకాడులోని ప్రయివేటు షాపింగ్ కాంప్లెక్స్‌లో ప్లాస్టిక్ వస్తువుల నిషేధం, పసుపు బ్యాగులను పంపిణీ చేసే కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై ప్రజలకు పసుపు బ్యాగులు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ బాధ్యత కలిగిన యువత, ప్రజలు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగం ద్వారా పర్యావరణానికి ముప్పు కలగడంతో పాటు భావితరాల భవిష్యత్తుపై సైతం ప్రభావాన్ని చూపుతుందన్నారు. పర్యావరణశాఖ చీఫ్ ఇంజినీర్ సెల్విఇళవరసి, డిప్యూటీ ఇంజినీర్ శబరివాసన్ పాల్గొన్నారు.