
విక్రమ్‌తో జత కుదిరింది !
తమిళసినిమా: ఇతర భాషల్లో హిట్స్ అందుకుంటే వారికి కచ్చితంగా తమిళంలో అవకాశాలు వరిస్తాయి. అలా కోలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న కన్నడ నటి రుక్మిణి వసంత్. ఈ బెంగళూర్ బ్యూటీ 2019లో బీర్బల్ త్రిలోగీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత అప్‌స్టార్ట్స్ అనే హిందీ చిత్రంలో నటించారు. 2023లో నటించిన సప్త సాగరదాచే ఇలో అనే చిత్రం రుక్మిణి వసంత్‌కు మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రం పలు అవార్డులను సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌లోనూ నటించిన రుక్మిణి వసంత్‌కు తరువాత కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌కు జంటగా భైరతి రణంగళ్ అనే భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అలా అక్కడ స్టార్ హీరోయిన్ అంతస్తును తెచ్చుకున్న ఈ భామకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాలింగ్ వచ్చింది. అలా అక్కడ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్‌కు జంటగా నటించారు. ఆ తరువాత కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మదరాసి చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్ సేతుపతి సరసన ఏస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం ఆ మధ్య విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో మదరాసి చిత్రం కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి వసంత్‌కు తాజాగా ఒక తెలుగు, ఒక తమిళం చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నారు. ఇకపోతే తమిళంలో విక్రమ్‌తో జత కట్టే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇటీవల వీరధీరశూరన్ చిత్రంతో హిట్‌ను అందుకున్న విక్రమ్ తాజాగా తన 64వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి 96, మెయ్యళగన్ చిత్రాల ఫేమ్ ప్రేమ్‌కుమార్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకిగా నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
నటి
రుక్మిణి వసంత్
నటుడు విక్రమ్
నటుడు, నిర్మాత జేఎస్‌కే సతీష్‌కుమార్