
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ఒప్పందాలు
సాక్షి ,చైన్నె : విద్యార్థుల్లో విద్యాపరమైన నైపుణ్యం, వృత్తిపరమైన వృద్ధిని పెంపొందించడానికి అంకితభావంతో పనిచేయనున్నట్టు చైన్నెస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ భూమినాథన్ తెలిపారు. విద్యార్థులకు హాస్పిటాలిటీ విద్యను అంతర్జాతీయ అభ్యాస అనుభవంతో అందించేందుకు వీలుగా సింగపూర్‌లోని బర్మింగ్‌హమ్ అకాడమీతో చైన్నెకు చెందిన అమృత ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఇరు విద్యా సంస్థల చైర్మన్లు డాక్టర్ ఎన్‌జీ జూన్ పెంగ్, భూమినాథన్ ఒప్పందాలపై సంకతాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔత్సాహిక హాస్పిటాలిటీ నిపుణుల కోసం ఒక ప్రత్యేకమైన విద్యా ప్రయాణానికి నాంది పలికేలా ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు ప్రదానంగా ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ విద్యను అందించడానికి నిబద్ధతతో రెండు సంస్థలు పనిచేయనున్నాయని తెలిపారు.