కూటమి అభ్యర్థి విజయానికి సమష్టిగా పని చేయండి | - | Sakshi
Sakshi News home page

కూటమి అభ్యర్థి విజయానికి సమష్టిగా పని చేయండి

Mar 22 2024 9:45 AM | Updated on Mar 22 2024 3:01 PM

మాట్లాడుతున్న తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్‌   - Sakshi

మాట్లాడుతున్న తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్‌

తిరువళ్లూరు: స్థానిక పార్లమెంట్‌ స్థానంలో కూటమి అభ్యర్థి విజయానికి అన్ని పార్టీల ప్రతినిధులు సమష్టిగా పని చేయాలని తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్‌ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు పార్లమెంట్‌ స్థానం నుంచి డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీ చేయనున్నారు.

కూటమి అభ్యర్థి గెలుపు అంశంపై చర్చించడానికి వేర్వేరు పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్‌ హాజరై మాట్లాడారు. డీఎంకే ప్రభుత్వం మూడేళ్లలో వేర్వేరు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఎంకే ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌, పారీ నేతలు తిరుత్తణి భూపతి, కూటమి నేతలు ఆదిశేషన్‌, ద్రావిడభక్తన్‌, బాబు, గోపాల్‌, తమిళరసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement