అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Mon, Nov 20 2023 12:38 AM

-

సేలం: సంప్రదాయ కూరగాయల సాగులో రాణిస్తున్న రైతుల నుంచి జిల్లా స్థాయి అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈరోడ్‌ జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మరగతమణి తెలిపారు. ఈరోడ్‌ జిల్లాలో ఉద్యానవన శాఖ, మెట్ట పంటల శాఖ, రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమం అవార్డులు 2023– 2024 కింద సంప్రదాయ కూరగాయల సాగులో ప్రతిభ కనబరిచిన రైతులకు జిల్లా స్థాయి అవార్డులు అందజేస్తున్నారు. ఇందులో జిల్లా స్థాయి నిపుణుల కమిటీల ద్వారా ఇద్దరు రైతులను జిల్లా స్థాయి నిపుణుల కమిటీ ఎంపిక చేసి అవార్డు అందజేయనుంది. సంప్రదాయ కూరగాయల రకాల పునరుద్ధరణ, ఇతర రైతులకు సంప్రదాయ కూరగాయల విత్తనాలు చేర్చడం, నీటి నిర్వహణ, సేంద్రీయ విత్తన పునరుద్ధరణ, సరైన భూసారం వంటి అంశాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మొదటి బహుమతి విజేతకు రూ.15 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు అందజేస్తారు. ఆసక్తి గల రైతులు ఉద్యానవన శాఖ వెబ్‌సైట్‌ www.tnhorticulture.tn.gov.in లేదా జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం నుంచి దరఖాస్తులను పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తును రూ.100 రుసుంతో పాటు సమీపంలోని ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement