సిలిండర్‌ పేలి గాయపడిన అత్త, అల్లుడి మృతి | - | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ పేలి గాయపడిన అత్త, అల్లుడి మృతి

Sep 4 2023 1:18 AM | Updated on Sep 4 2023 9:59 AM

- - Sakshi

అన్నానగర్‌: కొడైకెనాల్‌లో సిలిండర్‌ పేలి గాయపడిన అత్త, అల్లుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. తంజావూరుకు చెందిన సుభాష్‌ (30) భార్య అనిత (28), కొడుకు కపిలన్‌ (1), అత్త భువనేశ్వరి (56)తో కలిసి దిండుక్కల్‌ జిల్లా కొడైకెనాల్‌ ఆనందగిరి 1వ వీధిలో ఉంటున్నాడు. గతనెల 28న భువనేశ్వరి ఇంట్లో గ్యాస్‌ స్టవ్‌ ఆన్‌ చేసింది. ఆ సమయంలో గ్యాస్‌ లీకేజీ కావడంతో సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి.

ఇందులో భువనేశ్వరి, సుభాష్‌, అనిత, కపిలన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇరుగుపొరుగు వారు వారిని రక్షించి కొడైకెనాల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి చికిత్స నిమిత్తం తేని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం నలుగురిని తంజావూరు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స ఫలించక ఆదివారం సుభాష్‌, భువనేశ్వరి మృతి చెందారు. కొడైకెనాల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement