కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

మేళ్లచెరువు : గత పాలకులు నూతన మండలాలు ఏర్పాటు చేసి వదిలేశారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వాటిని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. చింతలపాలెం మండలం బుగ్గమాధవరం వద్ద నిర్మిస్తున్న రాజీవ్‌గాంధీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లిఫ్టు ద్వారా హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని నాలుగు మండలాల్లోని 12 గ్రామాల్లో 14,100 ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. గత 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా లిఫ్టు సౌకర్యం కల్పించి నట్లు తెలిపారు. అనంతరం చింతలపాలెం నుంచి మేళ్లచెరువు వరకు రూ.10 కోట్లతో నిర్మించిన రోడ్డు ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ నాగభూషణం, దొండపాడు సర్పంచ్‌ చెన్నకేశి వెంకయ్య యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, నందిరెడ్డి ఇంద్రారెడ్డి, రాములు నాయక్‌, తిరుపతిరావు యాదవ్‌, రంగా చారి, గురవయ్య, సైదులునాయక్‌ పాల్గొన్నారు.

ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement