మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

బాలుర పాఠశాల తనిఖీ

సూర్యాపేటటౌన్‌ : వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులు, ఇన్‌–పేషెంట్‌, అవుట్‌–పేషెంట్‌ విభాగాలను పరిశీలించారు. వార్డులకు వెళ్లి రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌, ఆర్‌ఎమ్‌ఓతో పాటు వివిధ విభాగాల హెచ్‌ఓడీలతో సమావేశఛర రోగులకు అందుతున్న వైద్య సేవలపై చర్చించారు. జనవరి నుంచి మే వరకు 1.12 లక్షల మంది అవుట్‌ పేషట్లు, 25వేల మంది ఇన్‌ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కలెక్టర్‌ తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో భాగంగా మోకాలి చిప్పల మార్పిడితో పాటు ఇతర ఆర్థిపెడిక్‌ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్‌ బాధితులకు ప్రత్యేకంగా యూనిట్‌ను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు సంరక్షణ బ్లాక్‌ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. ఆయన వెంట ఆర్‌ఎంఓలు గీతా వాణి, ప్రశాంతి, డాక్టర్లు మనీషా, సతీష్‌, ఉపేందర్‌ సింగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంత్‌రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

సూర్యాపేటటౌన్‌ : స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ శుక్రవారం తనిఖీ చేశారు. కంప్యూటర్‌ ల్యాబ్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న డిజిటల్‌ విద్యపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్‌ షెడ్‌ను, టాయిలెట్లను పరిశీలించారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో తెలుగు పుస్తకం చదివించారు. స్పష్టంగా చదివిన వారిని అభినందించారు. బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డీఈఓ అశోక్‌, హెచ్‌ఎం పద్మ, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement