సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రాన్ని సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట టౌన్–1 పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణను కొత్తగా ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు ఆయన వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, డీసీఆర్బి ఇన్‌స్పెక్టర్ మగ్దూం అలీ, ఎస్‌ఐలు ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో రాబోయే రోజుల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయన జాగ్రత్తలు వివరించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం పొందవద్దని, ఆయా ప్రాంతాల్లో పిడుగు పాటు వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు వాతావరణంలో మార్పులను గమనించి ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకోలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా డయల్ 100ను సంప్రదించాలని కోరారు.
ఫ పట్టణంలో అదనంగా
20 సీసీ కెమెరాలు


