నాగారం : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ ఆదేశించారు. శుక్రవారం నాగారం జడ్పీహెచ్‌ఎస్‌లో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పుల సవరణకు ప్రభుత్వం సర్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ నెల 25 నుంచి బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు కలిగిన వారి వివరాలను సేకరించి నమోదు చేయాలన్నారు. అనంతరం బీఎల్‌ఓలకు మెటీరియల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవేంద్రప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ షాహిన్‌బేగం, ఆర్‌ఐ జార్జి రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ హరిసింగ్


