రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

కోదాడరూరల్‌ : రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. గురువారం కోదాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది కవాతును పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం ద్వారా నేరాలను అరికట్టాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ, పెట్రోలింగ్‌ నిర్వహించాలని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం పట్టణంలోని షీ టీం కార్యాలయాన్ని పరిశీలించారు. మహిళలు, విద్యార్థుల భద్రతపై అమలువుతున్న చట్టాలపై విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కలిగించాలని సూచించారు. ట్రాఫిక్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, డీసీఆర్బీ సీఐ మగ్దూం అలీ, రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ అంజిరెడ్డి, షీటీం ఎస్‌ఐ మల్లేశం, అఖిల్‌, అంజన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, స్బిబంది ఉన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement