భానుపురి (సూర్యాపేట) : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విపత్తు నిర్వహణ, సహాయక చర్యలపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖ తమ బాధ్యతలను గుర్తించి, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే కాలనీలను, ఎక్కువ ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉన్న ఏరియాలను గుర్తించాలని సూచించారు. వరద బాధితులను తరలించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తంచి ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


