నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కొలువైన ఆంజనేయస్వామికి మంగళవారం భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొలచిన దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ స్వామివారికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధంతో అభిషేకం చేశారు. అనంతరం తమలపాకులతో స్వామివారిని విశేషంగా అలంకరించి పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, పెలిజాల వెంకటరమణారావు, తాటికొండ వెంకట్‌రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రావు, పోలవరపు బెనర్జీ, జెట్టి వెంకన్న, యడవల్లి వెంకట్‌రెడ్డి, దుర్గాప్రసాద్, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


