చివ్వెంల(సూర్యాపేట) : వృద్ధాప్యంలో ఉన్న తల్లి దండ్రులకు పిల్లలు ఆసరాగా నిలవాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని భాషానాయక్ తండా గ్రామ శివారులోని స్నేహ నిలయాన్ని ఆమె సందర్శించారు. వృద్ధుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు పోషకాహారం అదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా పాలు, బ్రెడ్లు, పండ్లు అందించి, వారితో కొంతసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్‌ఎస్‌ఏ నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, కె.ప్రియదర్శిని పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి పర్హీన్ కౌసర్


