యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆలయ అర్చకులు ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేపట్టారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement