పీహెచ్‌సీలో వైద్యురాలికి కాన్పు.. | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలో వైద్యురాలికి కాన్పు..

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

‘ఎక్స్‌’లో అభినందించిన మంత్రి

పెన్‌పహాడ్‌ : ప్రభుత్వ వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించుకుని మగబిడ్డకు జన్మనిచ్చిన మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) డాక్టర్‌ చిప్పలపెల్లి అనూషను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం ‘ఎక్స్‌’లో ప్రత్యేకంగా అభినందించారు. పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురం ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరంలో ఎంఎల్‌హెచ్‌పీ వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అనూష తన తొలి కాన్పు కోసం శనివారం పెన్‌పహాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. దీంతో అక్కడి వైద్యులు అనూషకు సాధారణ ప్రసవం చేశారు. ప్రభుత్వ వైద్యురాలు అయి ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకుని ప్రభుత్వ వైద్యసేవల పట్ల నమ్మకం పెంచినందుకు మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.ప్రతి గర్భిణీకి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపిక

కోదాడరూరల్‌ : కోదాడ పట్టణంలోని ఈఆర్‌ఎస్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం బ్యాడ్మింటన్‌ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరు కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో ఈ. కనిష్క్‌(కోదాడ), పి.ఆర్యన్‌ వర్మ(కోదాడ), ఈ.బాలగంగధర్‌రెడ్డి(నేరేడుచర్ల), బి.హరినందన్‌(సూర్యాపేట), ఎం.వర్షిత(నల్లబండగూడెం), జి.అనివిరెడ్డి(నేరేడుచర్ల) ఎ.శ్రీహిత (సూర్యాపేట), ఏ.ఆద్య(కోదాడ), ఏ.మిథిలా(కోదాడ)లు ఉన్నారు. వీరు ఆగస్టు, సెప్టెబంర్‌లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్‌–11, 13 పోటీల్లో పాల్గొననునానరు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఏటుకూరి రామారావు అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ టి.రంగారావు, కోచ్‌లు ఎస్‌కె.ఖాజాజలీల్‌ అహ్మద్‌, ఎస్‌కె.ఖాజా పజి ల్‌, ఎస్‌కె.నిసార్‌ ఉన్నారు.

హామీల అమలులో

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు

మునగాల : ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం మునగాల మండలం ముకుందాపురంలో పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జూలకంటి విజయలక్ష్మి, బచ్చలకూర స్వరాజ్యం, షేక్‌ సైదా, శిక్షణ క్లాస్‌ టీచర్‌ రమేష్‌, మండల కమిటీ సభ్యులు బోళ్ల కృష్ణారెడ్డి, చందా చంద్రయ్య, డి.స్టాలిన్‌రెడ్డి, వీరబోయిన వెంకన్న, శాఖ కార్యదర్శి సరికొండ నాగరాజు, వెంకటరెడ్డి, నాగరాజు, సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement