మట్టపల్లి క్షేత్రంలో నిత్యారాధనలు | - | Sakshi
Sakshi News home page

మట్టపల్లి క్షేత్రంలో నిత్యారాధనలు

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి అర్చకులు నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

తిరునక్షత్రోత్సవ పూజలు ప్రారంభం

మట్టపల్లి క్షేత్రంలోని చైన్నెకి చెందిన యజ్ఞ వాటికలో శ్రీస్వాతీనక్షత్ర మహాయజ్ఞ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 16 రోజులపాటు నిర్వహించే తిరు నక్షత్రోత్సవ పూజలను ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. శతాధిక యజ్ఞకర్త దివంగత ముక్కూరు నరసింహాచార్యర్‌ 82వ జయంతిని పురస్కరించుకుని శ్రీస్వామి ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయఅనువంశిక ధర్మకర్తలు, స్వాతినక్షత్ర ట్రస్ట్‌ పీఠం చైర్మన్‌ ముక్కూరు శ్రీనివాసన్‌, చైన్నెకి చెందిన భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement