హుజూర్‌నగర్‌లో జిల్లాస్థాయి ఈత పోటీలు | - | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగర్‌లో జిల్లాస్థాయి ఈత పోటీలు

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌లోని గడ్డిరెడ్డి ఫంక్షన్‌ హాల్లోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఆదివారం జిల్లాస్థాయి ఈత పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు విద్యుత్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మొదటిసారి నిర్వహించిన ఈత పోటీలకు మంచి స్పందన రావడం అభినందనీయమన్నారు. ఈ పోటీలలో 8 నుంచి 11 ఏళ్లలోపు విభాగంలో బేబీ జోహిత, 15 నుంచి 20 ఏళ్లలోపు వారిలో జి. వివేక్‌, 52 నుంచి 60 ఏళ్ల లోపు వారిలో ట్రాన్స్‌కో డీఈ వెంకట కృష్ణయ్య, జానిమియా, గురువయ్య, 70 ఏళ్ల పైబడిన వారిలో లింగారెడ్డి విజేతగా నిలిచారు. మహిళ విభాగాల్లో విజయలక్ష్మి, హర్షిత బహుతులు అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ తన్నీరు మల్లికార్జున్‌, ఫ్లోర్‌ లీడర్‌ కోతి సంపత్‌రెడ్డి, పట్టణ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి వీరస్వామి, కోశాధికారి సైదారావు, గౌరవ సలహాదారులు గెల్లి రంగారావు, కొండయ్య, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement