ఊరంతా ఏకమై.. ఇల్లు కట్టించారు | - | Sakshi
Sakshi News home page

ఊరంతా ఏకమై.. ఇల్లు కట్టించారు

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

మునగాల : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ఏకమై ఇల్లు నిర్మించి ఇచ్చారు. మండలంలోని కలకోవ గ్రామానికి చెందిన పనస సైదులు(25) నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సైదులు తండ్రి అంతకు ముందే చనిపోగా తానే కూలిపనులు చేస్తూ తల్లిని పోషించుకునేవాడు. సైదులు మృతి చెందిన తర్వాత తల్లి వెంకటమ్మకు జీవనాధారం లేకుండా పోయింది. దానికి తోడు ఆమెకు ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామానికి చెందిన గణేష్‌ యూత్‌ అండగా నిలిచింది. కుల, మతాలకు అతీతంగా గ్రామాన్ని ఏకం చేసింది. గ్రామస్తులు రూ.2.50 లక్షలు సేకరించి ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఆదివారం గ్రామస్తులు కలిసికట్టుగా గృహప్రవేశం నిర్వహించారు.

ఫ మృతుడి కుటుంబానికి

గ్రామస్తుల చేయూత

Advertisement
 
Advertisement
Advertisement