వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్‌

తుంగతుర్తి : ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ గాజుల చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వడదెబ్బతో మృతి చెందిన చర్లపల్లి సోమయ్య మృతదేహాన్ని ఆయన సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తలనొప్పి, అధిక చెమటలు, నీరసం, తల తిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాని వెళ్లి వైద్య సేవలు పొందాలన్నారు. ఆయన వెంట రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ లింగమూర్తి, జిల్లా ఎపిడిమియాలజిస్ట్‌ సతీష్‌ కుమార్‌, సీహెచ్‌ఓ శ్రీనివాస్‌ రాజ్‌, హెచ్‌ఈఓ రవికుమార్‌, హెల్త్‌ అసిస్టెంట్లు కృష్ణమూర్తి, గాజుల సోమన్న, యాదగిరి, చారి, ఏ్‌ ఎంలు భారతి, శైలజ, ఆశ కార్యకర్తలు ఉన్నారు.

తాడి మ్యూజికల్‌ ఫెస్టివల్‌ పెద్ద కుట్ర

తుంగతుర్తి : తాడి మ్యూజికల్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం గౌడ్‌ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని అన్నారంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎక్విరియం ఈకో పార్క్‌ యజమాని రామ్‌ దేవ్‌ రావ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24న తాడి మ్యూజికల్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కల్లుగీత కార్మికులు వృత్తిని కాపాడుకునే క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటే.. కార్పొరేట్‌ వ్యవస్థ తాడి పేరుతో ఈవెంట్లు నిర్వహించి కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని చూడడం దారుణమన్నారు. సమావేశంలో గౌడ సంక్షేమ, కల్లుగీత సంఘం నాయకులు గుండగాని నాగరాజుగౌడ్‌, మల్లేష్‌గౌడ్‌, ముత్తయ్యగౌడ్‌, సుధాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement