మొసళ్లున్నాయ్‌ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

మొసళ్లున్నాయ్‌ జాగ్రత్త

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

న్యూస్‌రీల్‌

సాగర్‌ ప్రాజెక్టు దిగువన కృష్ణా నది తీరం మొసళ్లకు నిలయంగా మారింది.

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

- 8లో

తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్‌ విధానంలో పాలక మండళ్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దాంతో జాబితాలను ఇవ్వాలని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, సెగ్మెంట్ల బాధ్యులను జిల్లా అధికారులు కోరారు. దాంతో గ్రామాలలో మళ్లీ సందడి నెలకొంది. పదవి ఆశిస్తున్న నాయకులు తమ వంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

గడువు పొడిగింపుతో..

పాక్స్‌ల పాలకమండళ్లు, డీసీఎంఎస్‌, ఎన్‌డీసీసీబీ పాలకవర్గం గడువు 14 ఫిబ్రవరి 2025న ముగిసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి గడువును మరో 6 నెలలు పొడిగించింది. అనంతరం మరో ఆరునెలల గడువును పొడిగిస్తూ 2025 ఆగస్టు 14న అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పొడిగింపు గడువు 2026 ఫిబ్రవరి 14 వరకు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాలకవర్గాలను రద్దు చేసి పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమిస్తూ 2025 డిసెంబరు 19న ఉత్తర్వులు జారీ చేసింది.

11 నుంచి 13 మంది జాబితా

గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాక్స్‌లకు ఎన్నికలకు బదులుగా నామినేటెడ్‌ విధానంతో పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు గత నెల 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే గడువు ఉండగానే పాలక మండళ్లను రద్దు చేయడం, ఎన్నికల విధానానికి బదులుగా నియమిత విధానానికి వెళ్లడంపై పలువురు నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు సూచన మేరకు ఈ నెల 5 నుంచి పాత పాలక మండళ్లను పునరుద్ధరించారు. అయితే ఈ పాలక మండళ్ల విషయం తేలాల్సి ఉండగానే.. నామినేటెడ్‌ విధానంలో ఒక్కో పాక్స్‌కు 11 నుంచి 13 మందితో కూడిన జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

18 రకాల వివరాలు పంపాలి

అధ్యక్షుడు, సభ్యులుగా నియమించేవారికి సంబంధించి 18 రకాల వివరాలను పంపాలని ప్రభుత్వం సూచించింది. మార్కెట్‌ కమిటీల మాదిరిగానే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు, అధికారులు ఎఫీషియో సభ్యులుగా ఉండనున్నారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, సెగ్మెంట్‌ బాధ్యులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ద్వారా పాలకమండళ్ల ప్రతినిధులను ఎన్నిక చేసే అవకాశం ఉంది. అయితే ఆశావహులు అప్పుడే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎరువులు, విత్తనాల విక్రయం, ధాన్యం మక్కల కొనుగోళ్లు, పెట్రోలు పంపుల నిర్వహణ, రుణాల పంపిణీ, బ్యాంకింగ్‌ కౌంటర్ల ద్వారా లావాదేవీల నిర్వహణ తదితర వాటితో పాక్స్‌లకు అమితమైన ప్రాధాన్యత ఉంది. దాంతో పాలక మండళ్లకు పోటీ ఎక్కువగానే ఉండనుంది.

ఉమ్మడి జిల్లాలో

సహకార సంఘాలు : 107

సూర్యాపేట జిల్లా : 44

నల్లగొండ జిల్లా : 42

యాదాద్రి భువనగిరి : 21

పీఏసీఎస్‌లకు పాలకమండళ్లు

ఫ కొత్తగా నామినేట్‌ చేసేందుకు

ప్రభుత్వం కసరత్తు

ఫ జాబితా పంపాలంటూ ఆదేశాలు

Advertisement
 
Advertisement
Advertisement