మెడికల్‌ షాపుల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ షాపుల బంద్‌

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

సూర్యాపేటటౌన్‌ : ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ విక్రయాలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం మెడికల్‌ షాపుల బంద్‌ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ షాపుల యూనియన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. అనంతరం వాటి యజమానులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాహకులు మాట్లాడుతూ ఆన్‌న్‌ లైన్‌ సర్వీసు వల్ల మెడికల్‌ వ్యాపారులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. మెడికల్‌ షాపులను డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని. మరి ఆన్‌లైన్‌లోన విక్రయించే మందులను ఎవరు పరిశీలిస్తారని ప్రశ్నించారు. మత్తు టాబ్లెట్లు, నకిలీ మందులు ఆన్‌న్‌లైన్‌ ద్వారా సులభంగా అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్‌ షాపుల యజమానులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ విక్రయాలపై నిరసన

Advertisement
 
Advertisement
Advertisement