నాగారం : ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ మోడల్ స్కూళ్లు వరంలా మారాయి. ఆదర్శ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు క్రీడలు, కళలు, సాంస్కతిక రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. 2026–2027 విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తునకు ఈ నెల 25 వరకు గడువు ఉంది.
జిల్లాలో 9 మోడల్ స్కూళ్లు
సూర్యాపేట జిల్లాలో 9 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. నాగారం(పసునూర్),తిరుమలగిరి (అనంతారం), సూర్యాపేట (ఇమాంపేట), పెన్‌పహాడ్ (అనాజీపురం), నడిగూడెం (కర్విరాల), గరిడేపల్లి (గడ్డిపల్లి), ఆత్మకూర్(ఎస్), మట్టంపల్లి, మునగాల మండలాల్లో మోడల్ స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఏసీఈ కోర్సులు ఉన్నాయ. ఒక్కో కోర్సులో 40 సీట్ల చొప్పున మొత్తం జిల్లాలో 1,440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లను భర్తీకి పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం ఎంపిక చేయనున్నారు. 100 మంది బాలికలకు హాస్టల్ వసతి సైతం కల్పిస్తారు.
25 తుది గడువు
ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 27న మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. ఎంపికై న విద్యార్థులకు 28 నుంచి 30 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
ఫ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు
ఫ జిల్లాలో 9 మోడల్ స్కూళ్లు


