నేడు సూర్యాపేటలో సదస్సు | - | Sakshi
Sakshi News home page

నేడు సూర్యాపేటలో సదస్సు

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

సూర్యాపేట అర్బన్‌ : సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జలగం జనార్దన్‌ (జెన్ను సార్‌) 5వ వర్ధంతి సందర్భంగా గురువారం సూర్యాపేటలోని చండ్ర పుల్లారెడ్డినగర్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ(ఎంఎల్‌)మాస్‌ లైన్‌ జిల్లా నాయకుడు కారింగుల వెంకన్న తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్‌ విక్రమ్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్ను సార్‌ అనునిత్యం అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేశారన్నారు. సదస్సుకు పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజ రు కావాలని కోరారు. సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌కుమార్‌, నాయకులు నవీన్‌రెడ్డి, శివ, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

యాదగిరీశుడికి

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట రూరల్‌ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు బుధవారం శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే స్వామి వారిని మేల్కోలిపిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. ఆ తర్వాత స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ప్రధానాలయం ముఖమండపం ముందు సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. ఇక ఆలయ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం తదతర నిత్యారాధనలు జరిపించారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement