అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషిచేద్దాం

May 20 2026 10:37 AM | Updated on May 20 2026 10:37 AM

నడిగూడెం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్‌ విశారదన్‌ మహరాజ్‌ పిలుపునిచ్చారు. నడిగూడెం మండలం తెల్లబల్లిలో అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని మంగళళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. రాబోయే రోజుల్లో జరిగే పోరాటంలో సబ్బండ వర్గాలు కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్‌ ఇవలపంగు సరోజిని, అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఫ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్‌

విశారదన్‌ మహరాజ్‌

Advertisement
 
Advertisement
Advertisement