భానుపురి (సూర్యాపేట) : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి సమావేశం విజయంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లోని జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఆర్డీఓలు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌తో నిర్వహించిన వెబెక్స్ కాన్ఫరెన్‌న్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయి సమావేశం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంబంధిత శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ కిషన్, డీపీఓ యాదగిరి, డీఎస్‌ఓ మోహన్ బాబు, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, అగ్రికల్చర్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జ్జి చంద్రయ్య
మృతికి సంతాపం
చివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య మృతికి సూర్యాపేట బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం అసోసియేషన్ కార్యాలయంలో చంద్రయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సవలను కొనియా డారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తళ్లమళ్ల హస్సేన్, ఉపాధ్యక్షుడు పోలెబోయిన నర్సయ్యయాదవ్, ఈసీ సభ్యులు వసంత సత్యనారాయణపిళ్లే యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, నాతి సవీందర్ కుమార్, గుంటూరు మధు, బి.వెంకటరత్నం, మీసాల శ్రీనివాస్, చనగాని ప్రణిత, భద్రయ్య, కట్ట సుధాకర్ పాల్గొన్నారు.
‘ప్లాస్టిక్ యూనిట్’ పనులు త్వరగా పూర్తిచేయాలి
నడిగూడెం : ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూ నిట్ పనులు త్వరగా పూర్తిచేయాలని జెట్పీ సీఈఓ బి.శిరీష ఆదేశించారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రం సమీపాన సాగర్ ఎడమ కాల్వ వెంట రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ పనులను ఆమె పరిశీలించి మాట్లాడారు. ఆమె వెంట జెట్పీ డిప్యూటీ సీఈఓ మహాలక్ష్మి, ఎంపీడీఓ ఎల్.మల్సూర్, పీఆర్ ఏఈ లావణ్య, ఎంపీఓ విజయలక్ష్మి, సర్పంచ్ దున్నా శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి, పలువురు వార్డు సభ్యులు ఉన్నారు.
భూ సేకరణకు
సహకరించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : భూ సేకరణకు రైతులంతా సహకరించాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు కోరారు. మంగళవారం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయంలో చెన్నూరు ప్రధాన కాల్వ భూ సేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడారు. ఈ సభలో తహసీల్దార్ హరిప్రసాద్, డీటీ జాన్ మహ్మద్, ఆర్‌ఐ సుజిత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


