తిరుమలగిరి (తుంగతుర్తి) : వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆయన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో అధికారులతో కలిసి అన్ లోడింగ్ పాయింట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం దిగుమతులు వేగవంతం చేయడానికి తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట తిరుమలగిరి తహసీల్దార్ హరిప్రసాద్, డీటీ జాన్‌మహ్మద్, ఆర్‌ఐ సుజిత్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ సూపర్‌వైజర్ అనిల్, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి ఉన్నారు.
2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం
తుంగతుర్తి : ఇప్పటి వరకు జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. మంగళవారం తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్‌తోపాటు వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. అన్ని కేంద్రాల్లో హమాలీలు, లారీ కొరతలు లేకుండా అన్‌లోడింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేసేలా చూస్తామని వివరించారు. పలు సమస్యలను కేంద్రాల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమార్, ఎంపీఓ సందీప్ ,వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్ బాబు, ఏపీఎం యాదమ్మ, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


