శివాలయంలో సంప్రదాయ పూజలు | - | Sakshi
Sakshi News home page

శివాలయంలో సంప్రదాయ పూజలు

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

యాదగిరిగుట్ట రూరల్‌ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివుడికి, రుద్రాభిషేకం, బిల్వార్చన సేవలు, అభిషేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభూవులకు సుప్రభాతం అర్చన, ఆరాధనలు, అభిషేకాలు సహస్త్రనామార్చనలు అర్చకులు చేపట్టారు. ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలతోపాటుగా, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహా హోమం, కల్యాణోత్సవం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం, జోడుసేవలను నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement